Rao Bahadur Trailer | ‘నాటకానికి మాయ తోడైతే’.. మహేష్ వాయిస్‌తో క్యూరియాసిటీ పెంచుతున్న ‘రావు బహదుర్’ ట్రైలర్!
Satya Dev | టాలీవుడ్ నటుడు సత్యదేవ్ (Satya Dev) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదుర్’ (Rao Bahadur).
Mahesh Babu | టాలీవుడ్ నటుడు సత్యదేవ్ (Satya Dev) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదుర్’ (Rao Bahadur). ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ (GMB Entertainment) బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు స్వయంగా మహేష్ బాబే వాయిస్ ఓవర్ అందించడం విశేషం.
“నాటకానికి లాజిక్ ఉండదు అంటారు.. కానీ నాటకానికి మాయ తోడైతే లాజిక్కే మారిపోతుంది” అంటూ సాగే మహేష్ బాబు గంభీరమైన వాయిస్ ఓవర్ ట్రైలర్‌కు ప్రాణం పోసింది. ఒక వ్యక్తి చనిపోవాల్సిన సమయం కంటే ఏడాది పాటు ఎక్కువ కాలం ఎలా బతికాడు? ఒక చిన్న అనుమానం ఒక మనిషి జీవితాన్ని, అతని విధిని ఎలా మార్చేసింది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ట్రైలర్ సరికొత్తగా సాగింది. తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక మైండ్ బ్లోయింగ్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌ను ఈ చిత్రం అందించబోతోందని మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ద్వారా హామీ ఇచ్చారు.
చివరి స్టేజ్ లివర్ క్యాన్సర్‌తో మరణానికి దగ్గరై, మిరాకిల్‌గా బతికిన వ్యక్తిగా, ‘రామప్ప’ అలియాస్ ‘రావు బహదుర్’ పాత్రలో సత్యదేవ్ తన నట విశ్వరూపం చూపించారు. డార్క్ కామెడీ, సస్పెన్స్, మ్యాజికల్ రియలిజం కలబోసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. స్మరణ్ సాయి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కార్తీక్ పర్మార్ అద్భుతమైన విజువల్స్ సినిమా రేంజ్‌ను పెంచేశాయి. ఈ చిత్రాన్ని శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఎ+ఎస్ మూవీస్ బ్యానర్లపై చింత గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వికాస్ ముప్పాళ్ల, దీపా థామస్, బాల పరాశర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

