Poonam Dhillon | ముగిసిన ‘డాన్ 3’ వివాదం.. పూనమ్ థిల్లాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన రణవీర్ సింగ్ తండ్రి
Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ 'డాన్ 3' సినిమా వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్‌పై జారీ చేసిన నాన్-కోఆపరేషన్ ఆదేశాలను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఉపసంహరించుకుంది.
Ranveer Singh | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమా వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్‌పై జారీ చేసిన నాన్-కోఆపరేషన్ ఆదేశాలను ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్ తండ్రి జగ్జిత్ సింగ్ భవ్నానీ.. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) ప్రెసిడెంట్, సీనియర్ నటి పూనమ్ థిల్లాన్‌కు ఫోన్ చేసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కష్టసమయంలో చిత్ర పరిశ్రమ తమకు అండగా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ విషయమై పూనమ్ థిల్లాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రణవీర్ సింగ్‌పై విధించిన ఆంక్షలను FWICE వెనక్కి తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రణవీర్ లాంటి నిబద్ధత కలిగిన నటుడిపై అలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని తాము మొదటి నుంచీ వ్యతిరేకించామని ఆమె పేర్కొన్నారు. ఒక నటుడిగా తనకు నచ్చిన సినిమాను ఎంచుకునే హక్కు రణవీర్‌కు ఉంటుందని, నిర్మాతలకు ఆయనకు మధ్య ఉన్న విషయాన్ని వారే చూసుకుంటారని స్పష్టం చేశారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో రణవీర్‌కు ‘దిల్ ధడకనే దో’, ‘గల్లీ బాయ్’ సినిమాల సమయం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయని, ‘డాన్ 3’ దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ కూడా ఒక నటుడే కాబట్టి తమ మద్దతు ఇరుపక్షాలకూ ఉంటుందని ఆమె తెలిపారు.
ఇక రణవీర్ తండ్రితో జరిగిన సంభాషణ గురించి పూనమ్ వివరిస్తూ.. ఈ వివాదంలో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఫర్హాన్ అఖ్తర్ బృందంతో రణవీర్ చాలా క్లోజ్‌గా ఉన్నాడని ఆయన చెప్పినట్లు పూనమ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము సహాయం చేస్తామని ప్రతిపాదించినప్పటికీ, సమస్య ఇప్పటికే పరిష్కార దశకు చేరుకుందని, అందుకే CINTAAను ఇబ్బంది పెట్టకూడదని రణవీర్ కుటుంబం భావించినట్లు పూనమ్ థిల్లాన్ వెల్లడించారు. ‘డాన్ 3’ సినిమా ప్రీ-ప్రొడక్షన్ నష్టాల కింద ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ రూ. 45 కోట్లు డిమాండ్ చేయడంతో మొదలైన ఈ వివాదం, FWICE తన నోటీసులను ఉపసంహరించుకోవడంతో ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

