Ranveer Singh | ‘కాంతార’ పంజుర్లీ దేవతపై రణ్వీర్ సింగ్ కామెంట్స్.. నెటిజన్ల విమర్శలు!
Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తాజాగా 'కాంతార' (Kantara) సినిమాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తాజాగా ‘కాంతార’ (Kantara) సినిమాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన నెటిజన్ల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు.
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో రణ్వీర్ సింగ్‌తో పాటు రిషబ్ శెట్టి పాల్గోనగా.. ఈ వేడుకలో రిషబ్‌ను ఉద్దేశించి రణ్వీర్ మాట్లాడుతూ.. కాంతార చిత్రంలో మీరు అద్భుతంగా నటించాడని తెలిపాడు. ముఖ్యంగా హీరోలో దెయ్యం(పంజుర్లీ దేవత) ప్రవేశించిన సన్నివేశాలు అదిరిపోయాయని కొనియాడాడు. అయితే పంజుర్లీ దేవతను దెయ్యం అని సంబోధించడంపై కన్నడిగులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇదే ఈవెంట్లో అత్యంత పవిత్రంగా భావించే కాంతారలోని “ఓం…” అనే గర్జనను రణ్వీర్ హాస్యంగా అనుకరించి చూపించాడు. దీన్ని చూసిన కన్నడ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “అది మా సంస్కృతి, మా ఆరాధనలో భాగం… దాన్ని జోక్‌గా తీసుకోవడం సరికాదని రణ్‌వీర్‌పై విరుచుకుపడుతున్నారు. చాలా మంది కన్నడిగులు రణ్వీర్ సింగ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
Dear @RanveerOfficial you don’t know the difference between God and Ghost ….🤦🤦🤦
Chavundi is Goddess not ghost ..🙏
And you literally mocking on big stage..🤦#KantaraChapter1 #RanveerSingh pic.twitter.com/SXV3HZdUfq— Agasthya ᵀᵒˣᶦᶜ (@sachi_1933) November 29, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

