Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Ranabaali | టాలీవుడ్లో ఆసక్తి రేకెత్తించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో మొదటి నుంచే అంచనాలు నెలకొన్నాయి.
Ranabaali | టాలీవుడ్లో ఆసక్తి రేకెత్తించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియడ్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో మొదటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. భారీ నేపథ్యం, చారిత్రక కథాంశం, విజయ్-రష్మిక జంట మరోసారి తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. విదేశాల్లో ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీంతో సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
‘రణబాలి’ కథ 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. బ్రిటిష్ పాలకుల కఠినమైన పన్నుల విధానాలు, రైతుల భూముల స్వాధీనం, కరువు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ప్రధానంగా చూపించినట్లు కథనం చెబుతోంది. ఈ పరిస్థితులను ఎదురించి పోరాడిన స్థానిక వీరుడు సింగనమల బొబ్బిలి రణబాలి ప్రయాణం చుట్టూ కథ తిరుగుతుంది. విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించగా, రష్మిక మందన్న జయమ్మగా నటించారు. కేవలం యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా, బ్రిటిష్ పాలనలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులను కూడా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూఏ 16+ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. సినిమా నిడివి సుమారు 178 నిమిషాలు కావడం కూడా చర్చనీయాంశంగా మారింది.
సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు విజయ్ దేవరకొండ నటనను ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆయన చూపించిన తీవ్రత ఆకట్టుకుందని అభిప్రాయపడుతున్నారు. క్లైమాక్స్‌లో విజయ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచినట్లు ప్రేక్షకుల స్పందనను బట్టి తెలుస్తోంది. కథలోని ఉద్వేగభరితమైన సన్నివేశాలకు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొంత ఉపశమనాన్ని అందిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చారిత్రక నేపథ్యాన్ని తెరపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని కొందరు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే సినిమా కథనం విషయంలో మాత్రం మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం, కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగదీసినట్లు అనిపించడం సినిమాకు ప్రతికూలంగా మారాయని కొందరు చెబుతున్నారు.దాదాపు మూడు గంటల నిడివి ఉండటంతో కథనం మరింత వేగంగా సాగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, చారిత్రక కథలను నిదానంగా ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ కథనం నచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు.
సాంకేతికంగా చూస్తే సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయని ప్రేక్షకుల స్పందన. బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని ప్రశంసిస్తున్నారు. ఇంటర్వెల్ సన్నివేశాలు, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ప్రధాన ఆకర్షణలుగా నిలిచినట్లు తెలుస్తోంది. అయితే సంగీతం, నేపథ్య సంగీతం విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘ఎందయ్యా సామి’ పాటతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని కొందరు చెబుతుండగా, కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం మరింత ప్రభావవంతంగా ఉండాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భావోద్వేగాలు కూడా కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో పండలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

