అందం, అభినయంతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకాభిమానులను సంపాదించుకుంది బ్యూటీఫుల్ లేడీ రంభ (Rambha). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోపాటు ఇతర టాప్ హీరోలతో కలిసి నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ లేడీగా బాక్సాపీస్‌ను షేక్ చేసింది రంభ. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కెనడాలో సెటిల్ అయింది. చాలా కాలం తర్వాత మళ్లీ నెటిజన్ల ముందుకొచ్చింది రంభ. ఇంతకీ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా..? ఇవాళ రంభ పుట్టినరోజు. భర్త, పిల్లలతో కలిసి బర్త్ డే కేక్ (Rambha birthday)కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది.
ఓ పక్కన గులాబీ పూలు, మరో పక్క రంభ చిరునవ్వులు..చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న రంభ బర్త్ డే స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైపోయింది రంభ. ఈ ముద్దుగుమ్మకు ముగ్గురు పిల్లలు కాగా..వారిలో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. తమ అభిమాన నటికి విషెస్ చెబుతున్నారు అభిమానులు, ఫాలోవర్లు. ఈ ఏడాది మహాసముద్రం సినిమాలో రంభ పేరు మీద ఓ పాట పెట్టి..ఆ సాంగ్‌ను రంభకు డెడికేట్ చేశాడు డైరెక్టర్ అజయ్ భూపతి.
సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా సంవత్సరాలే అవుతోంది. మరి రీఎంట్రీపై గతంలో వార్తలు వచ్చినా..వాటిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు రంభ. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనుందా..? లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుందంటున్నారు సినీ జనాలు.