హీరో రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ‘రాపో23’ వర్కింగ్ టైటిల్‌తో సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పుదుచ్చేరి శివార్లలో 24 గంటల పాటు నిర్విరామంగా ఈ సినిమా షూటింగ్‌ను జరిపారు. హీరోగా, దర్శకుడిగా ఈ సినిమా కోసం రామ్ ఎంతగానో శ్రమిస్తున్నారని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి.
‘పుదుచ్చేరిలో వేసిన భారీ సెట్లో తొమ్మిది రోజుల పాటు షూటింగ్ జరిపాం. ఇటీవల వర్షాల కారణంగా షెడ్యూల్‌కు బ్రేక్‌పడింది. త్వరలో మళ్లీ షూటింగ్‌ను మొదలుపెడతాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, నిర్మాత:కృష్ణ పోతినేని.