RAPO20 | మైసూరులో రామ్-బోయపాటి యాక్షన్?
Ram Pothineni-Boyapati Sreenu | రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటితో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేశాయి. అంతేకాకుండా రామ్ ఈ సినిమాలో మరింత మాస్ గా కనిపిస్తున్నాడు.
Ram Pothineni-Boyapati Sreenu | ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ పోతినేని తనలోని మాస్ కోణాని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’.. ఇటీవలే వచ్చిన ‘ది వారియర్’ చిత్రంలోనూ మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించలేకపోయినప్పటికి.. రామ్‌కు మాత్రం మాస్లో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా బోయపాటితో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా మైసూర్ లో ఓ మేజర్ షెడ్యూల్ ప్రారంభించింది. ఈ షెడ్యూల్లో ఓ పాట, ఫైట్ చిత్రీకరిస్తారట. ఆ తర్వాత హైదరాబాద్ లో ఓ పాట షూట్ చేస్తూ టాకీ పార్టు మొత్తం పూర్తవుతుందట. ఈ లెక్కన జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిపోయింది. ముందు నుంచి దసరాని టార్గెట్ చేస్తూ వస్తున్నా.. ప్రస్తుతం సినిమాను ముందే రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారట. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

