‘మ్యాడ్’ చిత్రంతో యువతలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రామ్ నితిన్. తాజాగా ఆయన మరో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. గురువారం హీరో రామ్‌నితిన్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి ‘ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్’ అంటూ పెట్టిన క్యాప్షన్ ఆకట్టుకుంటున్నది.
కలర్‌ఫుల్ కాలేజ్ వైబ్స్‌తో పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. కాకినాడ కాలేజీ నేపథ్యంలో జరిగే కథ ఇదని, నేటి ట్రెండ్‌కు అనుగుణంగా యువతను మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సింజిత్ యెర్రమల్లి, దర్శకత్వం: వెంకటేష్ నిమ్మలపూడి.