సినిమానే నా ఊపిరి
నిరంతర శ్రమ, ప్రతిభతో వారసత్వాన్ని మించిన గుర్తింపు తెచ్చుకున్నారు రామ్చరణ్. తండ్రి చిరంజీవి గర్వించే వారసుడయ్యారు. ‘ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా గుర్తింపుతో పాటు ఆస్కార్ అవార్డ్ విజయంలో భాగమయ్యారు.
నిరంతర శ్రమ, ప్రతిభతో వారసత్వాన్ని మించిన గుర్తింపు తెచ్చుకున్నారు రామ్చరణ్. తండ్రి చిరంజీవి గర్వించే వారసుడయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా గుర్తింపుతో పాటు ఆస్కార్ అవార్డ్ విజయంలో భాగమయ్యారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా బర్త్డే డీపీలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. రామ్చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు కామన్ డీపీని షేర్ చేస్తున్నారు. మరోవైపు ఆయన నటించిన ‘ఆరెంజ్’ సినిమా రీ రిలీజ్ థియేటర్లలో సందడి చేస్తున్నది. ఆయన పుట్టినరోజును ఆర్సీ 15 సినిమా యూనిట్ ఘనంగా జరిపింది. దర్శకుడు శంకర్, నాయిక కియారా, నిర్మాత దిల్ రాజు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తదితర యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి రామ్చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమాల గురించి తన దృక్పథాన్ని ఇటీవలి ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు చరణ్. ఆయన స్పందిస్తూ…‘సినిమానే నా ఊపిరి. ఇది కేవలం వారసత్వం అనుకోను. యాక్టింగ్ నా ప్యాషన్. బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలనే కోరిక నా కెరీర్ ప్రారంభం నుంచీ ఉండేది. మన మట్టిలో నుంచి పుట్టిన కథలతోనే ఇది సాధ్యమని తెలుసుకున్నా. మన పోరాటాలు, మన జీవితాలను చూపించే చిత్రాలే ఇవాళ ప్రాంతాలకు అతీతంగా ప్రపంచమంతా ఆదరణ పొందుతున్నాయి. భాషలు కాదు మనమంతా కలిస్తేనే చరిత్ర సృష్టించగలం’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

