Ram Charan | అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో రామ్‌చరణ్.. RC15 ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
Ramcharan-Shankar Movie | 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో ఆ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
Ramcharan-Shankar Movie | ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో ఆ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. లెజెండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే లీకైన పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్‌తో ఒక్క సారిగా సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా సోమవారం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
లేటెస్ట్గా రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్లో చరణ్ అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు దిల్‌రాజు గతంలోనే ప్రకటించాడు. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా కియారా అద్వాణి, అంజలిలు నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు.
ఇక దర్శకుడు శంకర్ కూడా హిట్ చూసి చాలా కాలమే అయింది. నిజానికి రోబో తర్వాత శంకర్‌కు హిట్టే లేదు. ప్రస్తుతం శంకర్ ఆశలన్ని ఆ సినిమాపైనే ఉన్నాయి. దీనితో పాటు శంకర్ కమల్‌హాసన్‌తో భారతీయుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు.
Here’s the first look of #GameChanger
Happy Birthday Megapower Star @AlwaysRamCharan💥@shankarshanmugh @advani_kiara @yoursanjali @DOP_Tirru @MusicThaman @artkolla @SVC_official #SVC50 #RC15 #HBDGlobalStarRamCharan pic.twitter.com/JpGohGhaeh
— Sri Venkateswara Creations (@SVC_official) March 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

