Ram Charan birthday | ‘అల్లూరి’ బర్త్ డే వేడుకల్లో ‘కొమ్రంభీం’
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కోస్టార్లు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానుల నుంచి రాంచరణ్ (Ram Charan birthday) కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బర్త్ డే నేపథ్యంలో 'కొమ్రంభీం' (Jr NTR) తన కోస్టార్ 'అల్లూరి సీతారామరాజు'కి (Ram Charan) నిన్న రాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశాడు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సిల్వర్ స్క్రీన్కు పరిచయమై..వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా మారిపోయాడు రాంచరణ్ . ఈ హీరో నేడు (Ram Charan birthday)పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా కోస్టార్లు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ఆర్ఆర్ఆర్ సక్సెస్, మరోవైపు బర్త్ డే నేపథ్యంలో ‘కొమ్రంభీం’ (Jr NTR) తన కోస్టార్ ‘అల్లూరి సీతారామరాజు’కి (Ram Charan) నిన్న రాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశాడు. రాంచరణ్‌కు హగ్ చేసుకుని బర్త్ డే విషెస్ చెప్పాడు తారక్.
ఈవెంట్‌కు సంబంధించిన స్టిల్‌ను రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బర్త్ డే పార్టీలో రాంచరణ్, ఉపాసనతోపాటు, తారక్-ప్రణతి, ఎస్ఎస్ కార్తికేయ-పూజా ప్రసాద్ కపుల్ సందడి చేసిన స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రాంచరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్న ఆర్సీ 15 ప్రాజెక్టు షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.
Read Also : Naga Chaitanya | చైతూ నెక్ట్స్ సినిమా చేసేది ఈ డైరెక్టర్‌తోనే..!
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. దీంతో చిరంజీవి నటించిన ఆచార్యలో కీలక పాత్రలో నటిస్తుండగా..ఇది వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్టులోనటిస్తున్నాడు. దీంతోపాటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31 మూవీ చేస్తున్నాడు.
Read Also : Upasana RRR benefit show | ‘అల్లూరి’ని చూసి గాల్లోకి పేపర్లు ఎగరేసిన ఉపాసన..వీడియో వైరల్
Read Also : Shobu Yarlagadda | ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ పై బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

