Rakul Preet Singh | రకుల్ కష్టం పగోడికి కూడా రాకూడదు.. గాయంతోనే షూటింగ్ చేస్తూ..
Rakul Preet Singh | బాలీవుడ్లో తాజాగా విడుదలైన ‘దే దే ప్యార్ దే 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అజయ్ దేవ్‌గణ్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ చిత్రం ఎనర్జిటిక్ కమ్‌బ్యాక్‌గా మారింది.
Rakul Preet Singh | బాలీవుడ్లో తాజాగా విడుదలైన ‘దే దే ప్యార్ దే 2’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అజయ్ దేవ్‌గణ్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ చిత్రం ఎనర్జిటిక్ కమ్‌బ్యాక్‌గా మారింది. అయితే ఈ విజయానికి వెనక రకుల్ ఎదుర్కొన్న శారీరక ఇబ్బందులు, బాదలు గురించి చాలా కొద్దిమందికే తెలుసు. ఈ సినిమా షూటింగ్ మధ్యలో రకుల్ లెవెల్-5 మస్కులర్ టియర్ అనే తీవ్రమైన గాయం బారిన పడింది. నడుము కండరాలు దాదాపు చిరిగిపోవడంతో తీవ్ర నొప్పి కాళ్ల వరకు వెళ్లేది.నడవడం కష్టం అయ్యేది. నిలబడటం కష్టసాధ్యం అయ్యేది. కాళ్లలో కరెంటు షాక్‌లా నొప్పులు ఉండేవి. ఈ పరిస్థితుల్లో కూడా రకుల్ రోజూ షూట్‌కు హాజరవుతూ యాక్షన్ సీక్వెన్సులు, డ్యాన్స్ షూట్లు పూర్తి చేసింది.
ఆమె చెప్పినదాని ప్రకారం, నొప్పి ఏ క్షణంలోనైనా తనను కూల్చేయొచ్చని భావించి, MRI రిపోర్ట్‌ను ప్రతిరోజూ జేబులో పెట్టుకొని సెట్‌కు వెళ్తూ ఉండేది. ఏదైనా జరిగితే డాక్టర్లకు వెంటనే చూపించాలనే ఉద్దేశంతో తాను ఇలా చేసేదని పేర్కొంది. అయితే తనకు నడుము నొప్పి భరించలేని స్థాయిలో ఉండేది. కానీ టీమ్‌కు ఇబ్బంది పడకూడదని, ప్రొడక్షన్ లాస్ అవకూడదని ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. పెయిన్‌కిల్లర్స్ వేసుకొని, ఫిజియో ట్రీట్మెంట్ తీసుకుంటూ రోజుకు 6 నుంచి 8 గంటలు యాక్షన్ చేసింది. ఒక్కోసారి షాట్ ఓకే అంటే నేలపైనే పడిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది.
రకుల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ గాయం బాలీవుడ్ చిత్రంతో కాదు,‘ఛత్రపతి’, ‘కొండ పొలం’ షూటింగ్ సమయంలోనే మొదలైంది. డాక్టర్లు ఆమెకు 6 నెలల కఠిన విశ్రాంతి సూచించినా, ఆమె రెండు నెలల్లోనే తిరిగి సెట్‌కి వచ్చి పూర్తి ఎనర్జీతో పనిచేసింది.ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని చెప్పిన రకుల్, ఆ రోజులు తన జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని దశగా గుర్తు చేసుకుంది. కొన్ని రోజులు నిజంగా నా బాడీ నన్ను వదిలేసినట్లు అనిపించింది. కానీ నా టీమ్‌ను నిరాశపరచకూడదన్న ఆలోచనే నన్ను నిలబెట్టింది. ఈ సంఘటనతో రకుల్ కేవలం గ్లామర్ స్టార్ మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన టీమ్ ప్లేయర్, గట్టి మనసున్న ఫైటర్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సినిమా రంగంలో నటీనటులు తరచుగా గాయాలతో కూడా షూటింగ్ చేయడం సాధారణమే. కానీ చాలా మంది అది బయట పెట్టరు. రకుల్ మాత్రం ధైర్యంగా సమస్యను వెల్లడించడం ద్వారా ఇతరులకు ప్రేరణగా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

