‘కొండపొలం’ తర్వాత రకుల్ తెలుగులో కనిపించలేదు. నిజం చెప్పాలంటే తెలుగులో ఆమె స్పీడ్ తగ్గిందనే చెప్పాలి. తమిళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తున్నది. అందులో ఒకటి శంకర్, కమల్ల ‘ఇండియన్2’ కాగా, రెండోది శివకార్తికేయన్ హీరోగా ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ ‘అయలాన్’. ‘ఇండియన్-2’లో రకుల్ పాత్ర పరిధి ఏ మేరకు ఉంటుందో చెప్పలేంకానీ, ‘అయలాన్’లో మాత్రం రకుల్ప్రీతే కథానాయిక.
శివకార్తికేయన్ సినిమా అంటే, హీరోయిన్లంతా లక్కీగా ఫీలవుతారు. కారణం తను మంచి కథల్ని ఎంచుకుంటాడు. పైగా ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. సినిమా మినిమమ్ గ్యారంటీ. ‘అయలాన్’ పుణ్యమా అని తమిళనాట రకుల్‌ని అందరూ లక్కీయస్ట్ హీరోయిన్ అంటున్నారు. దీంతో రకుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. “శివకార్తికేయన్‌తో చేయాలనే నా డ్రీమ్ నిజమైంది. పైగా ఇది అన్ని సినిమాల్లాంటి సినిమా కాదు. వెరైటీ సినిమా. ఇందులో నా పాత్ర కథలో కీలకం. ‘అయలాన్’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాను.” అంటూ ఆనందం వ్యక్తం చేశారు రకుల్.