Rakul Preet Singh | విలాసం కంటే సౌకర్యమే ముఖ్యం: రకుల్‌ప్రీత్‌సింగ్
గత ఏడాది బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. అయితే ఆ పెళ్లిలో అతిథులు ఫోన్లు వెంట తీసుకురావొద్దనే ఆంక్షలు విధించారు. ఈ విషయమై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్. పెళ్లి వేడుకను అందరూ ఆనందంగా ఆస్వాదించాలనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
Rakul Preet Singh | గత ఏడాది బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. అయితే ఆ పెళ్లిలో అతిథులు ఫోన్లు వెంట తీసుకురావొద్దనే ఆంక్షలు విధించారు. ఈ విషయమై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది రకుల్‌ప్రీత్‌సింగ్. పెళ్లి వేడుకను అందరూ ఆనందంగా ఆస్వాదించాలనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి ఫొటోలు అతిథుల ద్వారా బయటకు వస్తాయనే భయంతో ఫోన్లు నిరాకరించామని మీడియాలో వార్తలొచ్చాయి. వాటిలో వాస్తవం లేదు.
వివాహ వేడుక చాలా సింపుల్‌గా జరుపాలనుకున్నాం. కొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాం. నా దృష్టిలో విలాసం కంటే సౌకర్యం చాలా ప్రధానం. పెళ్లి తాలూకు మధుర క్షణాలను అతిథులు కూడా పరిపూర్ణంగా ఆస్వాదించాలని నో ఫోన్ పాలసీ పెట్టాం. పెళ్లి తర్వాత మేమే ఫొటోలను మీడియాకు విడుదల చేశాం’ అని చెప్పుకొచ్చింది. రకుల్‌ప్రీత్‌సింగ్ తాజా చిత్రం ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

