గత కొంతకాలం క్రితం దక్షిణాది రేసులో వెనకబడ్డ పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం ఇండియన్-2, ఆయాలాన్ వంటి సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్లో మాత్రం వినూత్న కథాంశాలను ఎంచుకొని సత్తా చాటుతున్నది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది రకుల్‌ప్రీత్‌సింగ్. ప్రేమలో ఎలాంటి నాటకీయత ఉండకూడదని, నిజాయితీగా ప్రవర్తించడం చాలా ముఖ్యమని చెప్పింది.
‘ఎలాంటి షరతులు లేకుండా ఒకరి ఇష్టాలను మరొరకు గౌరవించాలి. ఏ విషయంలోనూ బలవంతంగా అభిప్రాయాలను రుద్దకూడదు. పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నవారే ఇతరుల జీవితంలో సంతోషాన్ని తీసుకురాగలరు. ఎలాంటి ఇగోలు లేకుండా మన ఉన్నతిని కాంక్షించడమే నిజమైన ప్రేమ’ అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఈ భామ కొంతకాలంగా ప్రేమాయాణాన్ని సాగిస్తున్నది. అయితే పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరి కొన్నాళ్ల పాటు కెరీర్ మీదనే దృష్టి పెడతానని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్.