రీసెంట్గా (777 Charlie) సినిమాతో అందరినీ పలుకరించాడు కన్నడ (Mollywood) హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty). కన్నడ, తెలుగుతోపాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే కుక్క (పెట్) ప్రవేశించి..అతన్ని జీవితాన్నిఎలా మార్చేసిందనే కథాంశంతో తెరకెక్కింది 777 చార్లీ. రక్షిత్ శెట్టి తన యాక్టింగ్ తో బాక్సాపీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రాన్ని పరంవాహ్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించాడు రక్షిత్ శెట్టి.
కిరణ్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంసక్సెస్ ఫుల్‌గా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి అండ్ మేకర్స్ అద్బుతమైన నిర్ణయాన్ని తీసుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. సినిమాకు వచ్చిన లాభాల్లో 5 శాతం చార్లీ పేరు మీద ఇండీ డాగ్స్, జంతువుల సంక్షేమం కోసం పనిచేసే ఎన్జీవోలకు ఇవ్వాలని నిర్ణయించింది రక్షిత్ శెట్టి టీం.
మూగ జీవాల సంక్షేమం కోసం రక్షిత్ శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది మంది మనస్సును గెలుచుకుంటోంది. ఈ చిత్రంలో సంగీత శృంగేరీ, రాజ్ బీ శెట్టి, డానిష్ సేత్, బాబీ సింహా, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
Faith and gratitude has made this day possible! Reveling in 25 days of your love😊#777Charlie @Kiranraj61 @PrithviOfficial @karthiksubbaraj @RanaDaggubati @RajbShettyOMK @sangeethaSring @actorsimha @DanishSait @nobinpaul @pratheek_dbf @ParamvahStudios pic.twitter.com/1LoWBCF9E2
— Rakshit Shetty (@rakshitshetty) July 4, 2022