Rajeev Kanakala | ఇరకాటంలో పడ్డ రాజీవ్ కనకాల.. నోటీసులు పంపిన రాచకొండ పోలీసులు
Rajeev Kanakala | తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల భూ లావాదేవీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
Rajeev Kanakala | తెలుగు సినీ నటుడు రాజీవ్ కనకాల భూ లావాదేవీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు, అదే కేసులో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వివరాలలోకి వెళితే ..హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 421 వెంచర్లో రాజీవ్ కనకాల కు ఓ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను ఆయన కొన్ని నెలల క్రితం విజయ్ చౌదరికి విక్రయించారు. అధికారిక రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని సమాచారం.
అయితే, విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను ఎల్బీనగర్కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించారు. దాంతో లావాదేవీ ముగిసినట్లయింది. కానీ తర్వాత అసలు సమస్య మొదలైంది.శ్రవణ్ రెడ్డి తన ఫ్లాట్‌ను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు, సదరు ప్లాట్ ఎక్కడా కనిపించకపోవడం, ఆ స్థలంలో ఆనవాళ్లు లేకపోవడం గమనించారు. తనను నకిలీ స్థలంతో మోసగించారన్న అనుమానంతో, విజయ్ చౌదరిని సంప్రదించగా, మళ్లీ అమ్మనని, దీనిపై వివాదం నడుస్తోందని,ఏదైన ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి తప్పించుకున్నాడట. గట్టిగా అడిగితే అంతు చూస్తానని బెదిరించాడంటూ శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హయత్‌నగర్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు.దర్యాప్తులో భాగంగా, ముందుగా స్థలాన్ని విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రను పరిశీలించేందుకు ఆయనకు నోటీసులు పంపించారు.ఈ ఫ్లాట్ లావాదేవీలో రాజీవ్ పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక డాక్యుమెంట్లు, మ్యూటేషన్ రికార్డులు, స్థల పరిమితి వివరాలపై విచారణ కొనసాగుతోంది. ఈ వివాదం సినీ వర్గాల్లో, అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది. రాజీవ్ కనకా ఈ నోటీసులకు ఎలా స్పందిస్తారు, విచారణలో ఏం వెలుగులోకి వస్తుంది అనే విషయాలపై అందరి దృష్టి ఉంది. కాగా, రాజీవ్ కనకాల పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన ‘హోమ్టౌన్’ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది. ఇందులో ఝాన్సీతో కలిసి నటించిన ఆయన, తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

