‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ కోసం..
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవేదికపై ఘనంగా చాటింది.
ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నదని దర్శకుడు రాజమౌళి తండ్రి, చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ కొద్ది రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌కు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు మరో కొత్త దర్శకుడి పేరు బయటికొచ్చింది. దేవా కట్టా ఈ సినిమాకు సెకండ్ యూనిట్ దర్శకుడిగా పనిచేస్తాడని, ప్రధాన దర్శకుడిగా రాజమౌళి బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. అయితే ఈ సీక్వెల్‌కు ఇంకా చాలా సమయం ఉందని, మరికొన్ని మాసాల తర్వాతే దర్శకుడి విషయంలో స్పష్టత వస్తుందంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

