Raja Saab | రిలీజ్‌కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న రాజా సాబ్.. ఇక ఊచకోత తప్పుదు
Raja Saab | ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా, 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, సినిమాపై క్రేజ్ మాత్రం అప్పుడే పీక్‌కి చేరుతోంది.
Raja Saab | ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా, 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, సినిమాపై క్రేజ్ మాత్రం అప్పుడే పీక్‌కి చేరుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన తొలి పాట ‘రెబల్ సాబ్’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాటతో పాటు ప్రభాస్ లుక్, ఎనర్జీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే రెండో పాటను కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా, నార్త్ అమెరికాలో ‘ది రాజా సాబ్’ ప్రీమియర్ షోల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విడుదలకు ఇంకా దాదాపు నెల రోజుల సమయం ఉండగానే, ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో లక్ష డాలర్లకు పైగా కలెక్షన్ సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ప్రభాస్‌కు ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్‌ను మరోసారి స్పష్టంగా చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రమోషన్లు మరింత దూకుడుగా సాగితే, బుకింగ్స్ ఇంకా భారీగా పెరిగే అవకాశముందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ముగ్గురికీ కీలక పాత్రలు ఉన్నట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
సంగీత దర్శకుడు తమన్ అందిస్తున్న పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని భావిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటులు సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. మొత్తంగా, ‘ది రాజా సాబ్’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్‌తోనే శుభారంభం చేసింది. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా క్రేజ్ మరింత పెరగనుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

