ఈ కుర్ర హీరోకు అదృష్టం ఇప్పుడైన తడుతుందా?

కాలం కలిసిరానప్పుడు ఏం చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. కొందరు హీరోలకు ప్రస్తుతం ఇదే జరుగుతుంది. వాళ్లు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ప్రేక్షకుల నుంచి రిజల్ట్ మాత్రం ఒకటే వస్తుంది.. అదే డిజాస్టర్. రాజ్ తరుణ్ కెరీర్ ప్రస్తుతం ఇదే స్టేజిలో ఉంది. హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత.. సేమ్ టెంపో మెయింటైన్ చేయడంలో బొక్క బోర్లా పడ్డాడు. మంచి అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు దారుణంగా నిరాశపరచడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడిపోయింది. వరస సినిమాలు చేస్తున్నా కూడా ఏ ఒక్కటి ఈయన కోరుకున్న విజయం అందించడం లేదు.
అప్పుడెప్పుడో 2015లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత ఈయన నటించిన ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. మధ్యలో ఈడోరకం ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు మాత్రం పర్లేదు అనిపించాయి ఇక అప్పటి నుంచి అంధగాడు, రంగులరాట్నం, రాజు గాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ హిట్స్ మాత్రం రాలేదు.
ప్రస్తుతం ఈయన స్టాండప్ రాహుల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. స్టాండప్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు శాంటో. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా ఆసక్తిగా అనిపించలేదు. కానీ ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత విషయం ఉంది అని అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ కూడా ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తుంది. అయితే అది కేవలం టీజర్ వరకు మాత్రమే ఉందా.. సినిమాలో కూడా విషయం ఉందా అనేది మరికొద్ది రోజుల్లో తెలియనుంది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- raj tharun
- Stand Up Rahul
RELATED ARTICLES
తాజా వార్తలు
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
Hyderabad | గచ్చిబౌలి హోటల్లో అమెరికా పౌరుడి అనుమానాస్పద మృతి
Mookuthi Amman 2 | రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘మహాశక్తి’.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు,నయనతారకు నిరాశేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

