Srikanth Bolla | ఎమోషనల్‌గా ‘శ్రీకాంత్ బొల్లా’ బయోపిక్ ట్రైలర్.. జీవించేసిన రాజ్ కుమార్ రావు
Srikanth Bolla Biopic | బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న తాజా బయోపిక్ శ్రీకాంత్ (Srikanth). హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రానుండగా.. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నాడు.
Srikanth Bolla Biopic trailer | బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న తాజా బయోపిక్ శ్రీకాంత్ (Srikanth). హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రానుండగా.. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నాడు. జ్యోతిక, శరద్ కేల్కర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం ఉగాది పండుగ కానుకగా ట్రైలర్ విడుదల చేసింది.
ఇక ఈ ట్రైలర్ గమనిస్తే.. హైదరాబాద్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో దృష్టి లోపంతో జన్మించిన శ్రీకాంత్ ఆ తర్వాత ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. తన చదువు అనంతరం అన్నింటిని దీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు. చివరికి హైదరాబాద్‌లో బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ఎలా స్థాపించాడు. అనే స్టోరీతో ఈ సినిమా రానుంది. ఇక ఈ ట్రైలర్లో రాజ్ కుమార్ రావు శ్రీకాంత్ పాత్రలో జీవించాడు అని తెలుస్తుంది. టీ సీరిస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మార్ హీరానందానీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. 2024 మే 10న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

