Raid 2 Movie | అజయ్ దేవగన్ ‘రైడ్ 2’ ట్రైలర్ రిలీజ్
Ajay Devgan | బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’
Raid 2 Movie | యాక్షన్, మాస్, కామెడీ జానర్లతో పాటు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఒకడు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా.. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది.
రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఆదాయపు పన్ను విభాగంలో(Income Tax Department) సీనియర్ అధికారిగా పనిచేసే అమయ్ పట్నాయక్ (అజయ్ దేవగణ్) రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తల ఇళ్లపై దాడులు చేస్తూ వారిని నిద్రలేకుండా చేస్తుంటాడు. అయితే, ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై ఐటీ దాడి చేయాలని అమయ్ పట్నాయక్‌కి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుతాయి. ఈ సందర్భంలో దాడి కోసం ఆ ఇంటికి వెళ్లిన తర్వాత ఏం సంభవించిందనేది ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

