Intinti Ramayanam | పక్కా తెలంగాణ ఫ్లేవర్.. ట్రెండింగ్‌లో ఇంటింటి రామాయణం ట్రైలర్
Intinti Ramayanam | రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna), నవ్య స్వామి, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ ఇంటింటి రామాయణం (Intinti Ramayanam). ఈ మూవీ ట్రైలర్‌ను సిద్దు జొన్నలగడ్డ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే.
Intinti Ramayanam | పక్కా తెలంగాణ ఫ్లేవర్.. ట్రెండింగ్‌లో ఇంటింటి రామాయణం ట్రైలర్
Intinti Ramayanam | రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna), నవ్య స్వామి, నరేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రాజెక్ట్ ఇంటింటి రామాయణం (Intinti Ramayanam). సురేష్ నరెడ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఇంటింటి రామాయాణం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను సిద్దు జొన్నలగడ్డ లాంఛ్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే కథాంశంతో సినిమా రాబోతున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు డైరెక్టర్. ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్కుపై వ్యూస్ రాబట్టి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్, గ్రామంలోని కొందరు స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు, నరేశ్ ఇంట్లో బంగారం పోయిన తర్వాత జరిగే ఫన్నీ ఎలిమెంట్స్ తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
చివరలో బలగం ఫేం సుధాకర్ రెడ్డి.. ఇది అందరి ఇళ్లలో ఉండే రామాయణమే అంటున్నాడు. మొత్తానికి ఫన్, సీరియస్ ఎలిమెంట్స్ తో సాగే ఈ సినిమా పక్కా తెలంగాణ ఫ్లేవర్‌లో వినోదాన్ని అందించడం ఖాయమని అర్థమవుతోంది.
ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, మారుతి టీం సమర్పణలో.. IVY ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, బిత్తిరి సత్తి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంటింటి రామాయణం ట్రైలర్..
𝟏 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ Views & Counting for the theatrical trailer of #IntintiRamayanam 🤩
In cinemas from TOMORROW!
▶️ https://t.co/eBXkR84Q74 @DirectorMaruthi @vamsi84 @SitharaEnts @ItsActorNaresh @eyrahul @navya_swamy24 @Sureshflms @IVYProductions9 @adityamusic @ahavideoIN pic.twitter.com/pjKVqxtUMO
— Ramesh Bala (@rameshlaus) June 8, 2023
ముందుగాతెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల చేయాలని ఫిక్సయ్యారు. అయితే ఆ తర్వాత మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం జూన్ 9న (రేపు) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

