Rahul Dev | 57 ఏళ్ల వయసులో ప్రేమకు కొత్త నిర్వచనం.. ముగ్ధా గోడ్సేతో రాహుల్ దేవ్ సహజీవనం హాట్ టాపిక్
Rahul Dev | వెండితెరపై కరుడుగట్టిన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. దశాబ్దాలుగా స్టైలిష్ విలన్‌గా గుర్తింపు పొందిన ఆయన, ప్రస్తుతం 57 ఏళ్ల వయసులో తనకంటే 18 ఏళ్లు చిన్నదైన నటి, మోడల్ ముగ్ధా గోడ్సేతో పదేళ్లుగా సహజీవనం చేస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.
Rahul Dev | వెండితెరపై కరుడుగట్టిన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. దశాబ్దాలుగా స్టైలిష్ విలన్‌గా గుర్తింపు పొందిన ఆయన, ప్రస్తుతం 57 ఏళ్ల వయసులో తనకంటే 18 ఏళ్లు చిన్నదైన నటి, మోడల్ ముగ్ధా గోడ్సేతో పదేళ్లుగా సహజీవనం చేస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. రాహుల్ దేవ్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. 2009లో ఆయన భార్య రీనా దేవ్ క్యాన్సర్‌తో మృతి చెందడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఆ సమయంలో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ, తన కుమారుడి బాధ్యత కోసం సినిమాలకు కొంతకాలం దూరమయ్యారు. ఒక తండ్రిగా తన బాధ్యతలను నిర్వర్తించిన అనంతరం, 2013లో ఒక స్నేహితుడి పెళ్లిలో ముగ్ధా గోడ్సేతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది.
ముగ్ధా గోడ్సే ‘మిస్ ఇండియా 2004’ సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచిన వ్యక్తి. అలాగే ఫ్యాషన్ సినిమాతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి మధ్య 18 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ, యోగా, ఫిట్నెస్, ఆధ్యాత్మికత పట్ల ఉన్న ఆసక్తి వీరిని మరింత దగ్గర చేసింది. “ప్రేమకు వయసుతో సంబంధం లేదు” అంటూ ట్రోల్స్‌కి రాహుల్ దేవ్ తరచూ సమాధానం ఇస్తుంటారు. ఢిల్లీలో జన్మించిన రాహుల్ దేవ్, 2000లో వచ్చిన ఛాంపియన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఉత్తమ విలన్ విభాగంలో గుర్తింపు పొందిన ఆయన, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
తెలుగులో ఆయన విలనిజం ప్రత్యేక స్థానం సంపాదించింది. సింహాద్రి సినిమాలో బాలా నాయర్ పాత్ర ఆయనకు విశేషమైన గుర్తింపు తీసుకువచ్చింది. అలాగే అతడు సినిమాలో ప్రొఫెషనల్ కిల్లర్‌గా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. ‘ఆంధ్రావాలా’, ‘మున్నా’, ‘జై చిరంజీవ’, ‘టక్కరి దొంగ’ వంటి చిత్రాల్లో తనదైన స్టైల్‌తో టాలీవుడ్లో టాప్ విలన్‌గా నిలిచారు. రాహుల్ దేవ్ అంటే నటనతో పాటు ఆయన అద్భుతమైన ఫిజిక్ కూడా గుర్తుకు వస్తుంది. 57 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు పోటీగా సిక్స్ ప్యాక్ బాడీని మెయింటైన్ చేస్తూ ఫిట్నెస్ ఐకాన్‌గా నిలుస్తున్నారు. క్రమశిక్షణ, వ్యాయామం, యోగా ఆయన జీవనశైలిలో భాగమయ్యాయి. తెలుగు, హిందీతో పాటు మొత్తం తొమ్మిది భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, ప్రస్తుతం ఓటీటీ వేదికలపై కూడా సత్తా చాటుతున్నారు. ‘ది ఎంపైర్’, ‘పాయిజన్’ వంటి వెబ్ సిరీస్‌లలో తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
ఇక రాహుల్ దేవ్ తమ్ముడు ముకుల్ దేవ్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచితుడే. ఇటీవల ఆయన మరణం రాహుల్‌ను కలచివేసినా, వృత్తిపరంగా తన బాధ్యతలను కొనసాగిస్తున్నారు. తెరపై విలన్‌గా భయపెట్టే రాహుల్ దేవ్, నిజ జీవితంలో మాత్రం ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, ప్రేమకు కొత్త అర్థం చెప్పే వ్యక్తిగా నిలుస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

