Raghu Thatha | బిగ్ ఫైట్ : అల్లు అర్జున్ ‘పుష్ప’కు పోటిగా వస్తున్న కీర్తి సురేష్ ‘రఘు తాతా’
Keerthy Suresh | సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇక గత ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి వరుసగా తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది.
Keerthy Suresh | సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇక గత ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి వరుసగా తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే హిందీ నటుడు వరుణ్ ధావన్‌తో ఒక సినిమా చేస్తున్న ఈ భామ తాజాగా ‘రఘు తాతా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సుమన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రీసెంట్గా టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే అదే రోజు తెలుగులో అల్లు అర్జున్ పుష్ప విడుదల కానుంది. దీంతో ఆగష్ట్ 15న రెండు పెద్ద సినిమాలు పోటి పడనున్నట్లు తెలుస్తుంది.
ఇక రఘు తాతా టీజర్ చూస్తే.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న కీర్తి సురేష్ పాత్రతో టీజర్ ప్రారంభమవుతుంది. అయితే NCC మాస్టర్ హిందీలో శిక్షణ ఇస్తుండగా.. నాకు హిందీ రాదు తమిళంలో చెప్పండి సార్ అంటూ కీర్తి సురేష్ చెబుతుంది. దీంతో ఈ చిత్రం తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒక సన్నివేశంలో హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే దానిని కీర్తి సురేష్ తిరస్కరించడం చూడవచ్చు. ‘సలార్’ తో సక్సెస్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రోల్డన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

