Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Ramayana | భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతమ్మగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు.
Ramayana | భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతమ్మగా, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన తొలి భాగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో హనుమంతుడి పాత్ర, చివర్లో పరిచయమైన ఇంద్రజిత్ పాత్ర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందు ప్రచార చిత్రాల్లో రాముడు, సీత, రావణుడు, లక్ష్మణుడి పాత్రలను చూపించినప్పటికీ హనుమంతుడి లుక్‌ను మాత్రం మేకర్స్ రహస్యంగానే ఉంచారు. ట్రైలర్లోనూ ఆయనకు సంబంధించిన దృశ్యాలు లేకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా విడుదలైన మొదటి భాగంలోనూ హనుమంతుడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే సినిమా ముగింపు సమయంలో రెండో భాగానికి లీడ్ ఇస్తూ హనుమంతుడి పాత్రను పరిచయం చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసాను వినిపించడం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. సన్నీ డియోల్ పాత్రను పూర్తిస్థాయిలో చూపించకపోయినా, ఆయన ఎంట్రీతో రెండో భాగంపై అంచనాలు పెరిగాయి.
ఇక ఈ సినిమా ఎండ్ టైటిల్స్‌లో మరో ఆసక్తికరమైన పాత్రను పరిచయం చేశారు. రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్ అలియాస్ మేఘనాథుడి పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కనిపించారు. ఈ విషయాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమాతో రాఘవ్ జుయల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘ది ప్యారడైజ్’లో ఆయన ప్రతినాయకుడిగా నటించారు. షికంజా మాలిక్ పాత్రలో కనిపించే మోహన్ బాబు కుమారుడు విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ నటించారు. ఈ సినిమాలో ఆయన లుక్, నటనపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన డ్యాన్స్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే నటుడు ‘రామాయణం’లో రావణుడి కుమారుడు మేఘనాథుడిగా కనిపించడంతో అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. మొదటి భాగంలో ఆయన పాత్రకు సంబంధించిన పరిచయం మాత్రమే ఇచ్చినప్పటికీ, రెండో భాగంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Jharkhand | జనంపైకి దూసుకెళ్లిన లారీ.. జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

