Raga Kunche | ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కుటుంబంలో ఆనంద క్షణాలు నెలకొన్నాయి. ఆయన తాతయ్యగా ప్రమోషన్ పొందారు. రఘు కుంచె కుమార్తె రాగా కుంచె పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో వారి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈ సంతోషకర విషయాన్ని రాగా కుంచె స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో భావోద్వేగంతో “మా ప్రపంచం నీలిరంగులోకి మారిపోయింది.. మా బుజ్జి బాబు వచ్చేశాడు” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ, తన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చాడని రాగా తెలిపారు. ఈ ప్రయాణం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైందని, తల్లి అవ్వడం అనిర్వచనీయమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు రఘు కుంచె కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ శుభవార్తతో రఘు కుంచె కుటుంబంలో ఆనందం రెట్టింపైంది.
ఇక కుంచె రఘు కెరీర్ విషయానికి వస్తే ఆయన సింగర్‌గాను, నటుడిగాను, సంగీత దర్శకుడిగా కూడా పలు సినిమాలకి పని చేశారు. ఆయన సంగీతంలో రూపొందిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే రఘు కుంచె కాస్త స్లో అయ్యాడు. పలు ఇంటర్వ్యూలతో అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాడు