Radhika | తలుపులకి గడియలు పెట్టడం ఇబ్బందిగా మారడంతో కొత్త ఇంట్లోకి సెలబ్రిటీ కపుల్
Radhika | సెలబ్రిటీల జీవితశైలి అంటేనే విలాసవంతంగా ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. బాలీవుడ్ స్టార్లు ఎప్పుడు లగ్జరీ జీవితం మీద దృష్టి పెట్టినా, దక్షిణాది నటులు మాత్రం చాలామందీ సాదా జీవనాన్ని గడుపుతుంటారు.
Radhika | సెలబ్రిటీల జీవితశైలి అంటేనే విలాసవంతంగా ఉంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. బాలీవుడ్ స్టార్లు ఎప్పుడు లగ్జరీ జీవితం మీద దృష్టి పెట్టినా, దక్షిణాది నటులు మాత్రం చాలామందీ సాదా జీవనాన్ని గడుపుతుంటారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల నుంచి మిడ్-జనరేషన్ స్టార్స్ అయిన మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వరకు ఎంతటి క్రేజ్ ఉన్నా కూడా చాలా సింపుల్ లైఫ్‌ని ఇష్టపడుతుంటారు. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్‌లో సీనియర్ నటీమణిగా పేరు సంపాదించుకున్న రాధికా శరత్ కుమార్ కూడా ఇదే మార్గాన్ని అనుసరించారు. చెన్నై ఈసీఆర్ (ECR) లో ఉన్న ఆమె విలాసవంతమైన భవంతిని వదిలేసి ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయినట్టు తెలిపారు.
అద్దెకి ఇచ్చిన బంగ్లా సుమారు 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఏకంగా ఏడు ద్వారాలు కలిగిన ఈ ఇంటిలో కొన్ని సంవత్సరాలుగా రాధికా, శరత్ కుమార్ దంపతులు నివసిస్తున్నారు. అయితే, ఆ ఇంటిని నిర్వహించడం, తలుపులన్నింటికి రాత్రిళ్లు గడియలు వేయడం వంటి పనులు ఎక్కువ కావడంతో, వయసు మీద పడుతున్న ఈ దంపతులు ఇక ఈ ఇల్లు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. ఇంట్లో 15 మంది పని వాళ్లు ఉన్నా, ఈ ఇంటిని పూర్తిగా నిర్వహించడం చాలా కష్టంగా మారింది. పిల్లల పెళ్లిళ్లు అయిపోయాయి. కొడుకు విదేశాల్లో ఉన్నాడు. అంత పెద్ద ఇంట్లో ఇద్దరం మాత్రమే ఉండటం కూడా ఒంటరితనం కలిగిస్తుంది. అందుకే, ఆ ఇంటిని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అద్దెకిచ్చేశాం అని శరత్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాధికా, శరత్ కుమార్ ఇద్దరూ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తమిళ చిత్రాలతో పాటు, తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ, ఇతర భాషల్లోనూ అవకాశాలను అందుకుంటున్నారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు ముగించుకున్న ఈ జంట, ఇప్పుడు సినిమాలు, ట్రావెల్ చేస్తూ జీవితాన్ని సింపుల్‌గా, హ్యాపీగా గడుపుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రాధిక ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

