Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మూవీ రివ్యూ
ప్రేమకు, విధికి జరిగిన యుద్ధమే రాధేశ్యామ్ అంటూ దర్శకుడు రాజమౌళి చెప్పిన వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభమవుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలతో తన శిష్యుడు విక్రమాదిత్య (ప్రభాస్) గురించి గురువు పరమహంస (కృష్ణంరాజు) చెబుతూ
రివ్యూ – రాధే శ్యామ్
నటీనటులు – ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్, జయరామ్, ప్రియదర్శి తదితరులు
సాంకేతిక నిపుణులు – సినిమాటోగ్రఫీ – మనోజ్ పరమహంస, సంగీతం – జస్టిన్ ప్రభాకరన్, నేపథ్య సంగీతం – ఎస్ థమన్, ప్రొడక్ష్ డిజైనర్ – రవీందర్, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాణం – టీ సిరీస్, యూవీ క్రియేషన్స్, సమర్పణ – గోపీకృష్ణా మూవీస్, నిర్మాతలు – వంశీ, ప్రమోద్, ప్రశీద, రచన దర్శకత్వం – రాధ కృష్ణకుమార్
కథ
ప్రేమకు, విధికి జరిగిన యుద్ధమే రాధేశ్యామ్ అంటూ దర్శకుడు రాజమౌళి చెప్పిన వాయిస్ ఓవర్ తో సినిమా ప్రారంభమవుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలతో తన శిష్యుడు విక్రమాదిత్య (ప్రభాస్) గురించి గురువు పరమహంస (కృష్ణంరాజు) చెబుతూ అతన్ని హస్తసాముద్రిక నిపుణుల్లో గొప్పవాడని వివరిస్తాడు. అలా హీరో క్యారెక్టర్ ఇంట్రో మొదలవుతుంది. అతనికి తల్లి (భాగ్యశ్రీ), సోదరుడు ఉంటారు. విక్రమాదిత్య జోస్యం శాసనంలా జరిగి తీరుతుందని ప్రసిద్ధి. సరదాగా అమ్మాయిలతో గడిపే విక్రమాదిత్యకు వైద్యురాలు ప్రేరణ (పూజా హెగ్డే) పరిచయమవుతుంది. రొమాన్స్ తప్ప ప్రేమ మీద ఆసక్తిలేని విక్రమాదిత్య ప్రేరణ ప్రేమలో పడిపోతాడు గానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడు. ప్రేరణ కూడా విక్రమాదిత్య ప్రేమిస్తుంది. వీళ్ల ప్రేమకథ ఆనందంగా సాగుతుండగా..ప్రేరణ ఎక్కువకాలం బతకదనే నిజం ఆమె పెదనాన్న డాక్టర్ చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) ద్వారా విక్రమాదిత్యకు తెలుస్తుంది. కానీ అతను మాత్రం ప్రేరణ నూరేళ్లు జీవిస్తుందని జోస్యం చెబుతాడు. ప్రేరణ విషయంలో విక్రమాదిత్య జోస్యం నిజమైందా లేక ఆమెకు విధి నిర్దేశించినట్లు మృత్యువే పొంచి ఉందా. తన జీవితం గురించి పూర్తిగా తెలిసిన విక్రమాదిత్య ప్రేరణ కోసం ఏం చేశాడు అనేది మిగిలిన కథ.
ఫ్లస్ పాయింట్స్
ప్రభాస్, పూజా హెగ్డే నటన
కొత్త తరహా లవ్ స్టోరి
సాంకేతిక విభాగాల పనితనం
మైనస్ పాయింట్స్
మాస్ ఎలిమెంట్స్ తగ్గడం
ఎలా ఉందంటే..
70వ దశకంలో జరిగే కథ ఇది. కొన్ని కథలకు నేపథ్యంగా ఎంచుకున్న ప్రదేశాలు ప్రభావం చూపిస్తాయి. గీతాంజలి సినిమాలో కనిపించే వాతావరణం, పరిసరాల కూడా ఒక పాత్రను పోషిస్తాయి. అలా రాధేశ్యామ్ కథకు ఇటలీ నేపథ్యం ఆకర్షణ అయ్యింది. ఇలా కొత్త ప్రదేశంలోనే రాధేశ్యామ్ కథ జరగాలి అని ఊహించిన ప్రభాస్ ఆలోచన సరైనదే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ రాధేశ్యామ్ లాంటి కథకు అంగీకరించి, అందులోని భావోద్వేగాలకు కనెక్ట్ అవడం ఒక హైలైట్. టాప్ టెక్నీషియన్స్ తో కలిసి ఆ ఫీల్ ను స్క్రీన్ మీదకు తీసుకురావడం మరో హైలైట్. ప్రభాస్ స్టార్ డమ్ పక్కన పెట్టి చూడాల్సిన చిత్రమిది. భారీ ఫైట్స్ సీక్వెన్స్ లు, డ్రీమ్ సాంగ్స్ లో డ్యాన్సులు లాంటివేమీ ఇందులో ఉండవు. ఒక ప్రేమకథ, ఆహ్లాదకర ప్రదేశాల మధ్య అందంగా సాగుతుంటుంది. అందులోనే విక్రమాదిత్య, ప్రేరణ పాత్రలు, వాటి మధ్య విధి లిఖించిన సంఘర్షణలు, ప్రేమ కోసం వారు చేసిన త్యాగాలే ఆకట్టుకునేలా రూపొందించారు.
రాధేశ్యామ్ జంట ప్రభాస్, ప్రేరణ పాత్రల్లోకి సహజంగా మారిపోయారు. ఆ పాత్రల్లాగే అనిపించడం వాళ్ల నట ప్రతిభకు నిదర్శనం. విక్రమాదిత్యగా ప్రభాస్ తన ఇమేజ్ కు భిన్నమైన సెటిల్డ్ పర్మార్మెన్స్ చూపించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, పలికించిన ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. పూజా హెగ్డే కూడా ప్రేరణగా మెప్పించింది. విక్రమాదిత్య తన డైరీలో రాసుకున్న విషయాలు చదివినప్పుడు పూజా పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. కెప్టెన్ గా జయరామ్ ఆస్పత్రి సీన్లలో నవ్వించాడు. ప్రియదర్శి కామెడీ చేసేందుకు పాత్రలో వీలులేదు. డాక్టర్ చక్రవర్తిగా సచిన్ ఖేడ్కర్ ది కీలకమైన పాత్ర. భాగ్యశ్రీకి పెద్దగా స్క్రీన్ టైమ్, సీన్స్ లేవు. తల్లి పాత్రలో ఆమె ఉండటం సినిమాకు బరువు తీసుకొస్తుందని అనుకున్నట్లున్నారు.
టెక్నికల్‌గా రిచ్ మూవీ రాధే శ్యామ్. గ్రాండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ కనిపిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను ప్లెజంట్ గా చూపించింది. జస్టిన్ ప్రభాకరన్ చేసిన సాంగ్స్ సినిమాలో విజవల్ గా చూసినప్పుడు ఇంకా బాగున్నాయి. టెక్నీషియన్స్ లో రవీందర్ ఆర్ట్ వర్క్ మొత్తం సినిమా అంతా ఉంటుంది. హాస్పిటల్, ప్రభాస్ ఇళ్లు కోసం చేసిన ఆర్ట్ వర్క్ సహజంగా, కళాత్మకంగా ఉంది. థమన్ నేపథ్య సంగీతం మరో హైలైట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్‌లో షిప్ ఎపిసోడ్ కు చేసిన సౌండ్ డిజైనింగ్, విజువల్ ఎఫెక్టులు క్వాలిటీలో రాజీ పడలేదు. ప్రభాస్ సినిమా నుంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకుండా, ఒక ఫ్రెష్ లవ్ స్టోరి చూడాలనుకునేవారికి రాధేశ్యామ్ నచ్చుతుంది.
రేటింగ్ : 2.75/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

