కన్నడ హీరో ధృవ సర్జా, రచిత రామ్, హరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘పుష్ప రాజ్ ది సోల్జర్’. ఈ చిత్రాన్ని ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వాణి వెంకట్రామా సినిమాస్ పతాకాలపై బొడ్డు అశోక్, కె. రవీంద్ర కళ్యాణ్ తెలుగులోకి తీసుకొస్తున్నారు.
ఈ సినిమా ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల హైదరాబాద్లో చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ..‘ఈ సినిమా కన్నడలో మంచి విజయం సాధించింది.
తెలుగులో మూవీ మ్యాక్స్ ద్వారా విడుదల చేస్తున్నాం. కథా కథనాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటాయి’అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ప్రసన్న కుమార్, రామసత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు.