రాకా కోసం దీపిక సాహసం?
ప్రెగ్నెన్సీలో కూడా సెట్స్‌కి వచ్చి నటించిన నటీమణులు భారతీయ చలనచిత్ర చరిత్రలో చాలామందే ఉన్నారు. కానీ ప్రెగ్నెన్సీతో ఉండి యాక్షన్ సన్నివేశాల్లో నటించిన హీరోయిన్లు మాత్రం దాదాపుగా లేరనే చెప్పాలి.
ప్రెగ్నెన్సీలో కూడా సెట్స్‌కి వచ్చి నటించిన నటీమణులు భారతీయ చలనచిత్ర చరిత్రలో చాలామందే ఉన్నారు. కానీ ప్రెగ్నెన్సీతో ఉండి యాక్షన్ సన్నివేశాల్లో నటించిన హీరోయిన్లు మాత్రం దాదాపుగా లేరనే చెప్పాలి. కానీ దీపిక పదుకోన్ ఆ ఫీట్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాకా’లో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే దీపికా పదుకోన్‌పై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు అట్లీ చిత్రీకరించారట. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపిక.. ప్రెగ్నెనీతోనే కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారని సమాచారం.
అంతేకాదు, తన ‘ఎనిమిది గంటల పని’ నిబంధనను కూడా ఈ సినిమా విషయంలో ఆమె పక్కన పెట్టారని తెలిసింది. మెటర్నిటీ బ్రేక్ తీసుకునే ముందు, ‘రాకా’లో తన పార్ట్ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని ఆమె నిర్ణయించారట. అటు షూట్లో పాల్గొంటూనే ఇటు తన మొదటి కూతురు దువాను కూడా చూసుకుంటూ, లొకేషన్లో నటిగా, తల్లిగా రెండు బాధ్యతలనూ నిర్వర్తిస్తూ అందరి దృష్టినీ దీపిక ఆకర్షించారట. దీపిక తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునే తీరును చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

