Janatha bar | రాయ్‌లక్ష్మీ జనతాబార్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
Janatha bar | రాయ్‌లక్ష్మీ (Raai Laxmi) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్ (Janatha bar). ఈ చిత్రం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లను ప్రముఖ దర్శకుడు పరశురామ్ ఉగాది సందర్భంగా విడుదల చేశారు.
Janatha bar | టాలెంటెడ్ బ్యూటీ రాయ్‌లక్ష్మీ (Raai Laxmi) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం జనతాబార్ (Janatha bar). రమణ మొగిలి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లను ప్రముఖ దర్శకుడు పరశురామ్ ఉగాది సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ.. కమర్షియల్ విలువలతోపాటు ఓ బర్నింగ్ ఇష్యూను డీల్ చేస్తూ రూపొందించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. టైటిల్ కూడా క్యాచీగా వుంది. దర్శకుడు రమణ మొగిలికి ఈ చిత్రం మంచి పేరును తీసుకరావాలి అన్నారు.
దర్శక నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ.. రాయ్‌లక్ష్మీ కెరీర్లోనే ఇదొక డిఫరెంట్ చిత్రం. ఆమె పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు సమాజానికి చక్కని సందేశాన్ని జోడించి రూపొందించిన సినిమా ఇది. దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. తప్పకుండా చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు అన్నారు.
అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్ సంస్థ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న శక్తికపూర్, ప్రదీప్‌రావత్, అనూప్‌సోని, విజయ్‌భాస్కర్, దీక్షాపంత్, అమీక్ష,, మిర్చిమాధవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యజమాన్య, ఎడిటింగ్: ఉద్ధవ్, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, అంజి, మల్లేష్, డిఓపీ: అంజి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సిరాజ్, రచన: రాజేంద్ర భరద్వాజ్, కొరియోగ్రఫీ: సుచిత్ర చంద్రబోస్, అశోక్ రాజ, అజయ్, అశ్వర్థనారాయణ.



Read Also :
Naresh 61 | జాతిరత్నాలు బ్యూటీతో అల్లరి నరేశ్ కొత్త సినిమా.. వివరాలివే
NBK 108 | స్టైలిష్ మాస్ అవతార్‌లో బాలకృష్ణ.. ఎన్బీకే 108 ఫస్ట్ లుక్స్ వైరల్
Miss Shetty Mr Polishetty | Miss శెట్టి మిస్టర్ Polishetty నుంచి నోనోనో లిరికల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

