రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అనుమాన పక్షి’. ‘డిజె టిల్లు’ ఫేమ్ విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం రిలీజ్‌డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రాగ్ మయూర్ చేతిలో రైఫిల్ పట్టుకొని కనిపిస్తున్నారు.
పక్కనే బ్లాక్‌బోర్డ్‌పై కనిపిస్తున్న జీవితం, విధి, కర్మ అనే పదాలు కథపై ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, నేటి యువత ఆలోచనలను దగ్గరగా ఉంటుందని, వినోదానికి పెద్దపీట వేశామని మేకర్స్ తెలిపారు. మెరిన్ ఫిలిప్, సిసిల్, అనన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాతలు: రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, రచన-దర్శకత్వం: విమల్‌కృష్ణ.