లైంగిక వేధింపుల కేసుల్లో దోషిగా తేలిన పాప్ సింగర్

న్యూయార్క్: అమెరికా పాప్ సింగర్ ఆర్ కెల్లీ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలాడు. మొత్తం తొమ్మిది కేసుల్లో ఆయన్ను దోషిగా తేల్చారు. సెక్స్ క్రైం రింగ్‌ను నడిపినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆరు వారాల పాటు విచారణ తర్వాత కోర్టుకు ఈ నిర్ణయానికి వచ్చింది. చాలా వ్యూహాత్మక పద్ధతిలో మహిళలు, టీనేజర్లను రిక్రూట్ చేసి వారిని శృంగారం కోసం వినియోగించినట్లు కెల్లీపై ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ మహిళల్ని అత్యంత దారుణంగా శారీరకంగా వేధించినట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ హోదాలో ఉన్న కెల్లీ, తన హోదాతో మహిళల్ని వంచించినట్లు కోర్టు తెలిపింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు వచ్చే ఏడాది మే నెలలో వెలువరించనున్నది.
వేధింపుల కేసులో కెల్లీకి జీవితకాల శిక్ష పడే ఛాన్సు ఉంది. రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీ ఓ రింగ్‌లీడర్ తరహాలో స్కీమ్‌ను నడిపి, మహిళలను లైంగికంగా వేధించినట్లు కోర్టు తెలిపింది. ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై అన్న పాటతో ఫేమస్ అయిన సింగర్ కెల్లీ.. మహిళలను ట్రాఫికింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తీసినట్లు కూడా కెల్లీపై కేసులు ఉన్నాయి. కెల్లీతో పనిచేసిన మేనేజర్లు, సెక్యూర్టీ గార్డులు, ఇతర సభ్యులు ఎలా మహిళలను ఊబిలోకి దింపేవారో కోర్టు విచారణలో ప్రాసిక్యూటర్లు తెలిపారు. కెల్లీ తనను బంధించి, డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేశాడని ఓ మహిళ లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

