Aadikeshava | PVT4కు ఆదికేశవ టైటిల్.. వైష్ణవ్ తేజ్ మాస్ అవతార్ గ్లింప్స్
PVT4 | పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. PVT 4గా వస్తున్న ఈ చిత్రం టైటిల్ ఏంటో అప్డేట్ ఇస్తూ.. ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆదికేశవ (Aadikeshava) టైటిల్‌ను ఫైనల్ చేశారు.
PVT4 | టాలీవుడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. PVT 4గా వస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఏంటో అప్డేట్ ఇస్తూ.. ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆదికేశవ (Aadikeshava) టైటిల్‌ను ఫైనల్ చేశారు. గ్లింప్స్ వీడియోలో అంతా తవ్వేశారు.. మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటున్నాడు.
వైష్ణవ్ తేజ్ ఆ రౌడీల అంతు చూసే యాక్షన్ సన్నివేశాలతో గ్లింప్స్ వీడియో సాగుతుంది. వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంలో పక్కా యాక్షన్ మాస్ అవతార్‌లో అదరగొట్టబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థమవుతోంది. ఈ మూవీలో పెళ్లి సందD ఫేం శ్రీలీల, బీస్ట్ ఫేం అపర్ణా దాస్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్ యాక్టర్ కమ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో (PVT4 Glimpse Video) నెట్టింట హల్ చల్ చేస్తూ.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది.
‘రేయ్ రాముడు లంక మీద పడటం ఇనుంటావ్..అదే పది తలకాయలు ఊడి అయోధ్య మీద పడితే ఎట్టుంటాదో చూస్తావా..అని విలన్ అంటుంటే..ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప.. ఆ రాముడినే కొలిచే రుద్ర కాలేశ్వరుడు.. తలలు కోసి చేతికిస్తా నా యాళ..అంటూ సాగుతూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీని జులైలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
PVT4 గ్లింప్స్ వీడియో..
ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ వీడియో..
#AadiKeshavaFirstGlimpse Out Now! 🔥🔥🔥
▶️ https://t.co/qAkurwAtlp pic.twitter.com/qd0ezbWMXK
— Sithara Entertainments (@SitharaEnts) May 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

