Puspa 2 dialogues | పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్ప 2లో అల్లు అర్జున్ క్రేజీ డైలాగ్స్ ఇవే..!
అల్లు అర్జున్ ( Allu Arjun) ప్రస్తుతం ‘పుష్ప 2’ (Puspa.. The Rule) తో డబుల్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలుకానున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. పుష్ప 2 డైలాగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అల్లు అర్జున్ ( Allu Arjun) టైటిల్ రోల్ పోషించిన చిత్రం పుష్ప బాక్సాఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం ‘పుష్ప 2’ (Puspa.. The Rule) తో డబుల్ ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం పూర్తవగా.. ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలుకానున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది.
కాగా పుష్ప 2 డైలాగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో పుష్పరాజ్ చెప్పే ఓ డైలాగ్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పించేలా ఉండబోతుందట. అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే ఆ పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం..అనే డైలాగ్ ఉండనుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. మరి ఈ క్రేజీ డైలాగ్స్ ఉండబోయేది నిజమేనా..? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న పార్టు-2లో ఫహద్ ఫాసిల్, ధనుంజయ్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీక్వెల్ టీంలో కొత్త యాక్టర్లు కనిపిస్తారని వార్తలు రాగా.. వీటిపై రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. పుష్ప 2కు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సుకుమార్ (Sukumar).
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

