Pushpa 2 Stampede | పుష్ప 2 తొక్కిసలాట కేసు : A-11గా అల్లు అర్జున్.. 100 పేజీల చార్జిషీట్ దాఖలు.!
Pushpa 2 Stampede Case | డిసెంబర్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హైదరాబాద్ పోలీసులు కీలక అడుగు వేశారు.
Pushpa 2 Stampede Case | 2024 డిసెంబర్లో ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హైదరాబాద్ పోలీసులు కీలక అడుగు వేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా (A-11) పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో దాదాపు 100 పేజీల సమగ్ర చార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో సంధ్య థియేటర్ యాజమాన్యం ప్రధాన నిందితులుగా (A-1) ఉండగా, అల్లు అర్జున్‌తో పాటు ఆయన వ్యక్తిగత మేనేజర్, సిబ్బంది మరియు 8 మంది బౌన్సర్ల పేర్లు కూడా ఉన్నాయి. సినిమా ప్రీమియర్ సందర్భంగా వేలాది మంది అభిమానులు తరలివస్తారని తెలిసినప్పటికీ సరైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస భద్రతా ఏర్పాట్లు లేకుండా థియేటర్‌కు రావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసులు తమ నివేదికలో స్పష్టం చేశారు. అలాగే జనాలను నియంత్రించడంలో విఫలం కావడం, అజాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఒక మహిళ మరణానికి, ఆమె కుమారుడి తీవ్ర గాయాలకు కారణమయ్యారనే ఆరోపణలను చార్జిషీట్లో పేర్కొన్నారు. (2024 డిసెంబర్ 4న జరిగిన ఈ తొక్కిసలాటలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు.)
ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసులో బెయిల్‌పై ఉన్నారు. బాధితులకు అండగా ఉండటానికి ఇప్పటికే సుమారు రూ.2 కోట్లను అల్లు అర్జున్, పుష్ప చిత్ర బృందం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు సమాచారం. అయితే, చార్జిషీట్ దాఖలు కావడంతో ఇప్పుడు ఈ కేసు తదుపరి న్యాయ విచారణకు సిద్ధమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

