Dhamaka Movie | ధమాకా నుంచి పల్సర్ బైక్ వీడియో సాంగ్ వచ్చేసింది..!
'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో పట్టుకోల్పోయిన మార్కెట్‌ను 'ధమాకా'తో రెట్టింపు చేసుకున్నాడు మాస్‌రాజా రవితేజ. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం రిలీజ్ రోజునే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Dhamaka Movie | ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులతో పట్టుకోల్పోయిన మార్కెట్‌ను ‘ధమాకా’తో రెట్టింపు చేసుకున్నాడు మాస్‌రాజా రవితేజ. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం రిలీజ్ రోజునే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరుచూపించింది. తోలిరోజే దాదాపు రూ.7 కోట్ల షేర్ సాధించి రవితేజ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. రవన్న పర్ఫార్మెన్స్, శ్రీలీల డ్యాన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా విజయంలో పాటలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి.
అందులో ‘పల్సర్ బైక్’ సాంగ్ కోసమే థియేటర్‌కు మళ్లీ వెళ్లిన ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అప్పటికే యూటూబ్‌లో మార్మొగిపోతున్న ఈ సాంగ్‌ను ‘ధమాకా’ సినిమా కోసం మళ్లీ కొత్త సింగర్‌తో పాడిపించి క్లైమాక్స్‌లో యాడ్ చేశారు. అప్పటివరకు సినిమా ఓ ఫ్లోలో వెళ్తుంటే.. ఈ పాటతో ఎక్కడలేని హైప్ వచ్చింది. ఈ పాటలో రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అయితే వేరే లెవల్. ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు థియేటర్లో ఒక్కరు కూడా సీట్లలో కూర్చోలేరంటే ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పవచ్చు. తాజాగా ఈ పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది. మీరు ఓ లుక్కేయండి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

