Project-K Movie Title | ఆరొందల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రిస్టేజియస్ సినిమా ప్రాజెక్ట్-K. ఏడాదినర్థం క్రితం ప్రారంభమైన ఈ సినిమా చక చక షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. అందరి కంటే ముందుగా సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకుని.. అదే స్పీడ్‌తో ముందుకు వెళ్తుంది. ఇక ఈ సినిమాకు ప్రాజెక్ట్-K అని ఎందుకు పెట్టారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ప్రాజెక్ట్-Kలో కే అంటే కల్కి అని, కల్కి అంటే విష్ణుమూర్తి అవతారాల్లో చివరిది. ప్రభాస్ ఈ సినిమాలో కల్కిగా కనిపిస్తాడని ఎన్నో వార్తలు వచ్చాయి. వీటిని కూడా తీసిపడేయలేం. ఎందుకంటే నాగ్ అశ్విన్ ఈ సినిమా కథను పురాణాలను బేస్ చేసుకుని రాసుకున్నానని గతంలోనే చెప్పాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో టైటిల్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రాజెక్ట్-Kలో కే అంటే కాలచక్ర అని, ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాకు ప్రాజెక్ట్ కాలచక్ర అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఈ సినిమాలో వాడే టైమ్ ట్రావెల్ మిషన్ పేరు కూడా కాలచక్ర అని అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.
ఇక ఈ సినిమా టైటిల్, ట్రైలర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా జూన్ 20న అమెరికాలో జరిగే శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో వెల్లడించనుంది. కాగా కామిక్ వేడుకల్లో ప్రదర్శించనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్-K సినిమా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు దక్కని గౌరవం దీనికి లభించనుంది. ఈ కార్యక్రమానికి ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, అశ్వినీ దత్ హాజరుకానున్నారు. T