Project-K Movie Teaser | టాలీవుడ్ సినీ చరిత్రలో అత్యంత కాస్ట్లీయెస్ట్ సినిమాగా రూపొందుతున్న మూవీ ప్రాజెక్ట్-K. దీని బడ్జెట్ సుమారు ఆరొందల కోట్లకు పైమాటే. రాను రాను ఈ నెంబర్ పెరుగుతుండచ్చు అన్నది కూడా ఓ సమాచారం. ఏదేమైనా ఇంత కాస్ట్లీ సినిమా చేస్తున్నారంటే దానికి తగ్గ రేంజ్‌లోనే ప్రమోషన్లు గట్రా చేస్తుండాలి. ఈ విషయంలో ప్రాజెక్ట్-k బృందం ఒక మెతుకు ఎక్కువే తిన్నట్లు అనిపిస్తుంది. ముందు నుంచే చిత్రబృందం ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అవేంజర్స్ తరహాలో రూపొందిస్తున్నట్లు ప్రచారం చేస్తూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుంది. అందరి కంటే ముందే ఈ సినిమా సంక్రాంతి స్లాట్‌ను బుక్ చేసుకుంది. చెప్పిన తేదికి వస్తుందా రాదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకుంటే షూటింగ్ ఇంకా చాలా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆర్నెళ్ల టైమ్‌లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్లు పూర్తి చేసుకుని ఆపై ప్రమోషన్లు కూడా చేయాలి. చూస్తుంటే ఇది కష్టంగానే అనిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు వారాలు వేచి చూడాల్సిందే. ఎందుకంటే జూలై 20న ఈ సినిమా టైటిల్, టీజర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయనున్నారు.
కాగా తాజాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. జూలై 19 నుంచి అమెరికాలో శాన్ డియాగో కామిక్-కాన్ వేడుక జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రాజెక్టు-Kకు సంబంధించిన అప్డేట్లను రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కామిక్ వేడుకల్లో ప్రదర్శించనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్ట్-K సినిమా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు దక్కని గౌరవం దీనికి లభించనుంది. ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, నాగ్ అశ్విన్, అశ్వినీ దత్ హాజరుకానున్నారు.
ఇక ఆదిపురుష్ వంటి డిజాస్టర్ తర్వాత ఓ వైపు సలార్ టీజర్, మరోవైపు ప్రాజెక్ట్-k అప్డేట్లతో ప్రభాస్ అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. ఇరవై నాలుగ్గంటల ముందు రిలీజైన సలార్ యూట్యూబ్‌లో సిరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ప్రభాస్ ఫేస్‌ను పూర్తిగా రివీల్ చేయకుండానే రికార్డుల మోత మోగుతుందంటే ఇంకా ప్రభాస్ ఫేస్ రివీల్ చేసి, ఆయనతో ఒక్క డైలాగ్ చెప్పించుంటే అరాచకం ఉండేది. ఇక ఇప్పుడిప్పుడు ఆ ఆదిపరుష్ ఫలితం నుంచి కోలుకుంటున్న అభిమానులకు ఇలా రోజు వ్యవధిలో రెండు సినిమాలకు సంబంధించిన బిగ్ అప్డేట్లు రావడం ఎక్కడలేని సంతోషాన్నిచ్చింది.
𝐏𝐑𝐎𝐔𝐃 𝐌𝐎𝐌𝐄𝐍𝐓!
San Diego @Comic_Con, here we come.#ProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @AshwiniDuttCh @VyjayanthiFilms pic.twitter.com/uodkNyPmSk
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 6, 2023