SS Rajamouli | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి (S.S. Rajamouli) వలనే తన జీవితం నాశనం అయ్యిందంటూ అతడి స్నేహితుడైన ఉప్పలపాటి శ్రీనివాస్ రావు(Uppalapaati Srinivas Rao) ఒక సుసైడ్ నోట్‌తో పాటు వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి టార్చర్ భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశాడు.
ఈ వీడియోలో ఒక అమ్మాయి వలన రాజమౌళి తాను విడిపోయినట్లు చెప్పాడు శ్రీనివాస్ రావు.. అందరి లైఫ్‌లో జరిగినట్లే మా లైఫ్‌లో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళిని ప్రేమించింది. ఆ తర్వాత నన్ను ప్రేమించింది. అచ్చం ఆర్య 2 సినిమా కథలాగే ఉంటుంది. అయితే ముగ్గురం క్లోజ్ కాబట్టి నేను రాజమౌళిని అడిగాను ఇప్పుడు ఏం చేద్దామని. అప్పుడు రాజమౌళి నువ్వు త్యాగం చేయాలి అన్నాడు. దీంతో ఏం ఆలోచించకుండా నేను నా ప్రేమను త్యాగం చేశాను. ఇదంతా శాంతి నివాసం సీరియల్‌కి ముందు జరిగిన ఘటన. అయితే తాను నెంబర్ 1 అయ్యాక నన్ను టార్చర్ పెట్టాడు. దీంతో 55 ఏండ్లు అయిన వాడి వలన పెళ్లి కూడా చేసుకోలేదంటూ శ్రీనివాస్ రావు చెప్పుకోచ్చాడు.
అయితే శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రాజమౌళి, శ్రీనివాస్ రావు లైఫ్‌లోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరని నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తున్నారు. రాజమౌళి లైఫ్‌లో ఇది నిజంగానే జరిగిందా లేదా అతడు అబద్దం చెబుతున్నాడా అని తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై రాజమౌళి కూడా స్పందిచాల్సి ఉంది.
రాజమౌళి మరియు ఆయన భార్య రమా టార్చర్ భరించలేక నేను చనిపోతున్నా అంటూ రాజమౌళి స్నేహితుడి సూసైడ్ వీడియో
నేను, రాజమౌళి 34 ఏళ్ల నుండి ఫ్రెండ్స్.. మా మధ్యలోకి రమా వచ్చింది
వీళ్ల కోసం నేను నా లైఫ్ త్యాగం చేశాను.. మధ్యలో మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి
ఇవన్నీ నేను బయట ఎక్కడ చెప్తానో… pic.twitter.com/icx5vZk0O7
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2025