‘గాడ్ ఫాదర్’ అందరినీ సంతోషపెట్టాడు
హీరో చిరంజీవితో ‘గాడ్ ఫాదర్' చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు.
హీరో చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమా దసరా పండుగకు విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ..‘మా సినిమా విడుదలైన ప్రతి చోటా మంచి విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ర్టాల్లో 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. బాలీవుడ్లో దాదాపు 10 కోట్ల రూపాయలు ఆర్జించింది.
అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధిస్తున్నది. ఓటీటీలు అందుబాటులో ఉన్న ఈ సమయంలో ఒక రీమేక్ చిత్రాన్ని చేసి మెప్పించడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంతా హ్యాపీ. ఇలాంటి సినిమా నెలకొకటి వస్తే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బతుకుతుంది. ఇండస్ట్రీ బాగుంటుంది. చిరంజీవి గారి స్టార్డమ్ వల్లే ఇంత ఘన విజయం సాధ్యమైంది. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్..ఇలా ప్రతి వారు తమ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

