Balagam Movie | ఇది వంద అవార్డుల ఫంక్షన్.. బలగం సినిమా గురించి ఎమోషనల్ అయిన దిల్ రాజు
Balagam Movie | ‘నేను వంద రోజుల ఫంక్షన్లు చూశాను. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటిసారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నాం’ అన్నారు ప్రముఖ నిర్మాత ‘దిల్'రాజు. ఇటీవల ఆయన నిర్మించిన విజయవంతమైన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి వేణు ఎల్ధండి దర్శకుడు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 100 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
Balagam Movie | ‘నేను వంద రోజుల ఫంక్షన్లు చూశాను. వంద కోట్ల పోస్టర్‌ను చూశాను. కానీ మొదటిసారి ఇలా వంద అవార్డుల ఫంక్షన్‌ను చూస్తున్నాం’ అన్నారు ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు. ఇటీవల ఆయన నిర్మించిన విజయవంతమైన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి వేణు ఎల్ధండి దర్శకుడు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 100 అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా నిర్మాతలు విశ్వ విజయ శతకం వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ ‘మానవ సంబంధాలు, వాళ్ల ఎమోషన్స్‌తో దర్శకుడు వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఇన్నేళ్ల మా కెరీర్లో 50 సినిమాలు తీసిన ఒక అంతర్జాతీయ అవార్డు కూడా రాలేదు. కానీ మా వారసులు నిర్మించిన మొదటి సినిమాకే అంతర్జాతీయ అవార్డులు సాధించారు. ఇదొక అద్భుతమైన సినిమా అని మొదటిరోజే అర్థమైంది. మళ్లీ ఇలాంటి గొప్ప చిత్రాలు తీయడానికి ప్రయత్నం చేస్తూనే వుండాలి’ అన్నారు. దర్శకుడు వేణు మాట్లాడుతూ ‘మూలాల్లోంచి రాసుకున్న కథ. అంతే సహజంగా తీయాలనుకున్నాను.తీశాను. ఈ సినిమాకు మొదటి హీరో ‘దిల్’రాజు, ఆయన నమ్మడం వల్లే ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద విజయం సాధించింది. సినిమా రిలీజై నాలుగు నెలలు అవుతున్నా ఇంకా ఈ సినిమా నన్ను వదలడం లేదు’ అన్నారు. తెలుగు సినిమా గురించి చెప్పాలన్నా.. రాయలన్నా ఖచ్చితంగా ‘బలగం’ సినిమా ప్రస్తావన లేకుండా వుండదని హీరో ప్రియదర్శి అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, కాసర్ల శ్యామ్ ఇతర సాంకేతిక నిపుణులు, చిత్రంలో నటించిన నటీ నటులు అందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

