Nabha Natesh | లిమిట్స్ దాటి ప్రవర్తించకు.. నటుడు ప్రియదర్శికి హీరోయిన్ నభా నటేష్ వార్నింగ్
సినిమాను తేలిగ్గా జనాల్లోకి తీసుకెళ్లడానికి వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఊహించని విధంగా వీధుల్లో కొచ్చేసి అల్లరి చేసేయడం, లైవ్ నడుస్తుంటే యాంకర్‌తో గొడవ పెట్టేసుకోవడం.. ఇలా అన్నమాట.
Nabha Natesh | సినిమాను తేలిగ్గా జనాల్లోకి తీసుకెళ్లడానికి వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఊహించని విధంగా వీధుల్లో కొచ్చేసి అల్లరి చేసేయడం, లైవ్ నడుస్తుంటే యాంకర్‌తో గొడవ పెట్టేసుకోవడం.. ఇలా అన్నమాట. ఇది ముందుగా ప్లాన్ చేసుకొని చేస్తున్న నాటకాలని తెలియని జనం ఆ గొడవని రిపీట్ చేసి చూడటం.. దీంతో సదరు చిత్రానికి ఆటోమేటిగ్గా ప్రచారం లభించడం.. ఇదో కొత్త స్ట్రాటజీ. ఈ పోకడ శృతిమించడంతో.. సాంఘిక మాధ్యమం వేదికగా ఇద్దరు వ్యక్తులకు నిజంగానే గొడవ జరిగినా.. అది కూడా పబ్లిసిటీ స్టంటే అంటున్నారు.
రీసెంట్గా నభా నటేష్కీ, నటుడు ప్రియదర్శికీ ఎక్స్(ట్విటర్) వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఈ గొడవ ఇప్పుడు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. వివరాల్లోకెళ్తే.. హీరో ప్రభాస్ వాయిస్‌తో డబ్స్మాష్ వీడియోను నభా ఇటీవలే పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌పై స్పందించిన ప్రియదర్శి ‘వావ్.. సూపర్ డార్లింగ్.. కిర్రాక్’ అంటూ రిైప్లె ఇచ్చాడు. దీంతో ‘ఐపీసీ సెక్షన్ 354ఏ ప్రకారం పరిచయం లేని ఒక స్త్రీని డార్లింగ్ అని సంభోదించడం లైంగిక వేధింపులతో సమానం’ అని రాసి ఉన్న ఒక మెసేజ్‌తో ప్రియదర్శికి రిైప్లె ఇచ్చి, ‘మిస్టర్.. కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త’ అని కూడా రాసింది నభా.
‘మనకు పరిచయం లేదన్న విషయం నాకు తెలీదు.. మీరైతే డార్లింగ్ అనేయొచ్చు.. మేమంటే సెక్షన్లా?’ అంటూ ప్రియదర్శి ఎదురు ప్రశ్నిస్తూ.. లైట్ తీస్కో డార్లింగ్..’ అని మరో రిైప్లె ఇచ్చాడు. దాంతో నభా కోపం నషాళానికి అంటి.. ‘లిమిట్స్ దాటి ప్రవర్తించకు.. తర్వాత చూసుకుందాం’ అంటూ సీరియస్‌గా రిైప్లె ఇచ్చింది. ప్రస్తుతం ఈ చాటింగ్ వైరల్ అవుతున్నది. నెటిజన్స్ ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తున్నారు. కొందరైతే.. వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారనీ, సినిమా పేరు ‘డార్లింగ్’ అనీ, సినిమా ప్రమోషన్ కోసం జనాన్ని పిచ్చోళ్లని చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

