Priya Prakash | ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయి పాపులారిటీ తెచ్చుకుంది మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె ఫస్ట్ మూవీ ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ చిత్రంలోని కన్ను గీటు సీన్ ప్రియా ప్రకాశ్ (Priya Prakash )కు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రియా ప్రకాష్ అందంతో ఆకట్టుకోవడమే కాకుండా.. మెస్మరైజ్ చేసే యాక్టింగ్ స్టైల్ తో సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ బ్యూటీ నెట్టింట కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తూ అప్పుడప్పుడు కుర్రకారు మనసు దోచేస్తుంటుంది. సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటూ నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ ఈ భామ వెకేషన్ టూర్ (Vacation Tour)లో బిజీగా ఉంది. బ్యాంకాక్‌లో తన స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు చేస్తుంది. తాజాగా బీచ్‌లో దిగిన ఫోటోలను ప్రియా ప్రకాష్ షేర్ చేసింది. ఈ ఫోటోలలో పసుపురంగు టాప్.. లైట్ బ్లూ బికినిలో కనిపిస్తూ.. అటూ ఫ్యాన్స్‌తో పాటు ఇటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ టూర్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రియా వారియర్ ఆశలన్నీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న బ్రో (Bro The Avatar) చిత్రం పైనే.. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం జులై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకు రెడీ అవుతుంది.