Prithviraj Sukumaran | మహేష్ – రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ నటుడు.?
SSMB 29 | దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ వరకు తీసుకెళ్లాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
SSMB 29 | దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా రేంజ్‌ను హాలీవుడ్ వరకు తీసుకెళ్లాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ఎప్పుడు ఉంటుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. ఎస్ఎస్ఎంబీ 29గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని రాజమౌళి అప్పట్లో వెల్లడించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు జక్కన్న. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు నటినటుల ఎంపిక జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు వి.విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తుండగా.. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ.. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా ఆర్.సి.కమల్ కణ్ణన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా మోహన్ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి పని చేయనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే నెలలో మూవీ కూడా లాంచ్ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇండోనేషియాకు చెందిన హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఇందులో హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

