Premgi Amaren | ప్రముఖ తమిళ కమెడియన్ కమ్ మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్జీ అమరెన్ తన 45వ ఏటా పెళ్లి చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయితో కలిసి ప్రేమ్జీ శనివారం ఏడడుగులు వేశాడు. మొదటి ప్రేమ్జీ పెళ్లి జూన్ 09న అని ప్రకటించారు కుటుంబ సభ్యులు. కారణం ఏంటో తెలిదు కానీ చెప్పిన తేదీ కంటే ఒకరోజు ముందే పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగా వైభవంగా జరిగింది. ప్రేమ్జీ మంకత్తా, మాస్, గోవా, సరోజా, చెన్నై 600028, బిర్యానీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెంకట్ ప్రభు తమ్ముడే ప్రేమ్జీ. ఇక ప్రేమ్జీ పెళ్లి చేసుకున్నట్లు వెంకట్ ప్రభు ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపాడు.
Wishing the newly weds @Premgiamaren Bro and #Indu a Happy married life.. 😊 pic.twitter.com/Npy2885BFJ
— Ramesh Bala (@rameshlaus) June 9, 2024