Prema Desam: ప్రేమ దేశం సీక్వెల్‌కు సన్నాహాలు..!

పాతికేళ్ల క్రితం విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన చిత్రం ప్రేమ దేశం. దర్శకుడు కదిర్ తెరకెక్కించిన ఈ చిత్రం 1996 ఆగస్ట్ 23న విడుదలైంది. వినీత్, అబ్బాస్, టబు ప్రధానపాత్రల్లో నటించగా, నిర్మాత కేటీ.కుంజుమన్ తన సొంత నిర్మాణ సంస్థ జెంటిల్మెన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించారు. తమిళంలో నిర్మించిన ‘కాదల్దేశం’ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయగా,ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులని సైతం ఎంతగానో మెప్పించింది.
ప్రేమ దేశం వంటి చిత్రాలు ఈ మధ్య కాలంలో రాలేదని, అలాంటి చిత్రాన్ని నిర్మించాలని దర్శకుడు కదిరిని కొద్ది మంది కోరడంతో సుదీర్ఘంగా ఆలోచన చేసిన ఆయన సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్ట్రిప్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. యంగ్ టాలెంటెడ్ యువతీ యువకులతో పాటు సీనియర్ నటీనటులు, అప్‌కమింగ్ యాక్టర్స్‌తో సినిమా చేయనున్నాం అని దర్శకుడు అన్నారు.
సీక్వెల్ చిత్రాన్ని ముందుగా తెలుగులో నిర్మించి ఆ తర్వాత తమిళంలోకి డబ్ చేస్తాం. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు నిర్మాత కోసం అన్వేషణ జరుగుతోంది అని ప్రేమ దేశం డైరెక్టర్ కదిరి పేర్కొన్నారు.
ముక్కోణ ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త ముగింపు చూపిన సినిమాగా ‘ప్రేమదేశం’ నిలచింది. తెలుగు వర్షన్ కు శ్రీరామకృష్ణ రచన చేయగా, భువనచంద్ర పాటలు పలికించారు. ఇందులోని “ముస్తాఫా ముస్తాఫా… డోన్ట్ వర్రీ ముస్తాఫా…” సాంగ్ ప్రతి ఫ్రెండ్షిప్ డేకి ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. “హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే…”, “ఓ వెన్నెలా…”కనులు తెరచినా కన్నెపిల్లా… క..క..క..కాలేజీ స్టైలే…”, “ప్రేమా ప్రేమా… ప్రేమా… ” పాటలు విశేషంగా మురిపించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kadiri
- prema desam
- sequeel
- vineeth
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

