పుష్ప సినిమాలోని సామీ సామీ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశమంతా పుష్ప ఫీవర్ పట్టుకుంది. నార్త్‌లో అయితే పుష్ప పాటలు పెట్టుకొని డ్యాన్స్‌లు చేస్తూ జనాలు అదరగొట్టేస్తున్నారు. కొందరైతే డ్యాన్సులు చేసిన వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తున్నారు.
అయితే.. ఈ ఫీవర్ కేవలం మన దేశానికే పరిమితం కాలేదు.. ఖండాంతరాలను దాటింది. ఇప్పటికే పలువురు విదేశీ సెలబ్రిటీలు పుష్ప సినిమాలోని సాంగ్స్‌కు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఆక్లాండ్‌కు చెందిన ఓ గర్భిణీ సామీ సామీ పాటకు సూపర్‌గా డ్యాన్స్ వేసి దాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది.
గత వారం రోజుల నుంచి నా నోట్లో ఇదే పాట నానుతోంది. ఇదే పాటను పాడుతున్నా. నిజానికి సామీ సామీ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది కానీ.. నేనే కొంచెం లేట్ అయ్యాను. అందుకే ఈ డ్యాన్స్ ట్రై చేశా. పుష్ప సినిమాను ఎంతమంది చూశారుద. నాకు ఇంకా చూసే సమయం దొరకలేదు. ఈ వీక్ లిస్ట్‌లో ఉంది ఆ సినిమా.. అంటూ ఆ యువతి పోస్ట్ చేసింది.