ఎంపీ సంతోష్‌కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహబూబ్నగర్జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్‌లో పది రోజుల్లో రెండు కోట్ల ఎనిమిది లక్షల సీడ్ బాల్స్‌ను చల్లి గిన్నిస్ బుక్ రికార్డును సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మంగళవారం తెలంగాణ ఫిలిం చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ అభినందించారు.